హైదరాబాద్: మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. ‘నవ్వుల యాత్ర ప్రారంభం’ అనేది ఉపశీర్షిక. జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్ కథానాయిక. బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అనూప్ సింగ్ ఠాకూర్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. దీన్ని విష్ణు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.